డ్రగ్స్‌కు బానిసైన కొడుకు.. కిరాయి గూండాలతో చంపించిన తండ్రి
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
- రౌడీ షీటర్ అయిన కుమారుడిని అంతమొందించాలని తండ్రి నిర్ణయం
- రూ. 50 వేలకు ఇద్దరు కిరాయి గూండాలను మాట్లాడుకున్న వైనం
- ప్లాన్‌లో భాగంగా కుమారుడిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన తండ్రి
- అక్కడ తుపాకితో కాల్చి చంపిన నిందితులు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 28 ఏళ్ల యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సూత్రధారి అతడి తండ్రేనని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్వాలియర్‌లోని పురానీ కంట్రోన్మెంట్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్‌పై హస్టరీ షీట్ ఉంది. అతడిపై పలు నేరాలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. దీంతోపాటు జూదం, గంజాయి వంటి డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి.
కుమారుడి ప్రవర్తన కుటుంబంలోని ఇతర సభ్యులపైనా తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో అతడి పీడ వదిలించుకోవాలని తండ్రి హసన్ ఖాన్ నిర్ణయించాడు. కుమారుడిని చంపేందుకు అర్జున్ అలియాస్ షరాఫత్ ఖాన్, భీంసింగ్ పరిహార్ అనే ఇద్దరు కిరాయి వ్యక్తులను రూ. 50 వేలకు మాట్లాడుకున్నాడు.
ప్లాన్‌లో భాగంగా ఈ నెల 21న కుమారుడిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే పొంచి వున్న కిరాయి గూండాలు ఇర్ఫాన్‌పై పలుమార్లు తుపాకితో కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఇర్ఫాన్ తండ్రి హసన్‌ను నిందితుడిగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. కుమారుడిని తానే హత్య చేయించినట్టు విచారణలో అతడు అంగీకరించారు. హసన్ ఇచ్చిన సమాచారం మేరకు అర్జున్, భీంసింగ్ కోసం గాలిస్తున్నారు.