జ్ఞానవాపిలో మరోసారి సర్వేకి వారణాసి కోర్టు నో

  • అదనపు సర్వే, తవ్వకాలకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
  • ప్రధాన గోపురం కింద తవ్వకాలకు అనుమతి కోరిన హిందూ పక్షం
  • వారణాసి కోర్టు నిర్ణయాన్ని ఉన్నతస్థాయి కోర్టులో అప్పీల్ చేస్తామన్న హిందూ పక్షం న్యాయవాది
జ్ఞానవాపి కేసులో శుక్రవారం ఆసక్తికరమైన పరిణామం జరిగింది. జ్ఞానవాపిలో భారత పురావస్తు శాఖతో (ఏఎస్ఐ) అదనపు సర్వే చేయించాలని, ప్రధాన గోపురం కింద తవ్వకాలు చేపట్టాలంటూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారణాసి కోర్టు తీసుకున్న అనూహ్య నిర్ణయం తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని హిందూ పక్షం తరపు న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి అన్నారు.

కోర్టు నిర్ణయం వాస్తవాలకు, నిబంధనలకు విరుద్ధంగా ఉందని రస్తోగి వ్యాఖ్యానించారు. వారణాసి కోర్టు నిర్ణయాన్ని ఉన్నతస్థాయి కోర్టులో సవాలు చేస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 8, 2021 నాటి ఆర్డర్ ప్రకారం.. ఏఎస్ఐకి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందులో మైనారిటీ వర్గానికి చెందిన ఒకరు ఉండాలని పేర్కొన్నారు. కానీ సర్వే ఇందుకు అనుగుణంగా జరగలేదని రస్తోగి అన్నారు. ఏప్రిల్ 8, 2021 నాటి ఆర్డర్‌కు అనుగుణంగా సర్వే జరగలేదని హైకోర్టు ధ్రువీకరించిందని, కాబట్టి తాము హైకోర్టును ఆశ్రయించబోతున్నామని ఆయన చెప్పారు.


More Telugu News