మూసీ నది సర్వనాశనానికి కాంగ్రెస్ పార్టీనే కారణం: బండి సంజయ్
- మూసీ ప్రక్షాళన అంశంలో కాంగ్రెస్ × బీజేపీ
- మూసీ పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు తిరగాలన్న బండి సంజయ్
- సీఎం రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
మూసీ ప్రక్షాళన అంశంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. మూసీ నది సర్వనాశనానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. పరిశ్రమలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు తిరగాలని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మూసీ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని, మూసీ సుందరీకరణా? లేక, పునరుజ్జీవమా? అనేదానిపై స్పష్టత లేదన్నారు. గతంలో లక్షన్నర కోట్లు ఖర్చు అన్నారు... ఇప్పుడు ఆ మాట అనలేదంటున్నారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరిట డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.