టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నిందితుడు చైతన్యకు వైద్య పరీక్షలు

  • గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి
  • ఏ1 నిందితుడి ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం నేత చైతన్య
  • ఇటీవల కోర్టులో లొంగిపోయిన చైతన్య
  • మూడ్రోజుల సీఐడీ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఇటీవల కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చైతన్య ఏ1 నిందితుడిగా ఉన్నాడు. 

చైతన్యను కస్టడీకి అప్పగించాలని ఇటీవల సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మంగళగిరి కోర్టు చైతన్యను మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, చైతన్యను ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 

ఈ క్రమంలో, నేడు చైతన్యకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం అతడిని సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు.


More Telugu News