భారీ ఆధిక్యంపై కన్నేసిన కివీస్... కీలక వికెట్లు తీసిన సుందర్

  • ఆసక్తికరంగా పుణే టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 156 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 167 పరుగులు చేసిన కివీస్
  • 270కి చేరిన కివీస్ ఆధిక్యం
పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. 

ఆటకు ఇవాళ రెండో రోజు కాగా... మూడో సెషన్ సమయానికి న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. దాంతో కివీస్ ఆధిక్యం 270కి చేరింది. 

తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో సత్తా చాటిన ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్... రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి కివీస్ ను కట్టడి చేశాడు. కివీస్ జట్టులో ఓపెనర్ డెవాన్ కాన్వే 17, విల్ యంగ్ 23, రచిన్ రవీంద్ర 9, డారిల్ మిచెల్ 18 పరుగులు చేశారు.  

ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ 75, టామ్ బ్లండెల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.  అంతకుముందు, తొలి ఇన్నింగ్స్ లో కివీస్ జట్టు 259 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News