'లవ్ రెడ్డి' నటుడిపై ప్రేక్షకురాలి దాడి... వైరల్ అవుతున్న వీడియో
- థియేటర్స్ విజిట్ చేస్తోన్న లవ్‌రెడ్డి టీమ్‌కు చేదు అనుభవం
- నటుడు రామస్వామిపై దాడి చేసిన ప్రేక్షకురాలు
- మహిళకు నచ్చజెప్పిన చిత్రబృందం
అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన చిత్రం 'లవ్‌రెడ్డి'. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రబృందం హైదరాబాద్ నగరంలోని థియేటర్ల విజిట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లిన లవ్‌రెడ్డి చిత్రబృందానికి ఓ చేదు అనుభవం ఎదురైంది. 'లవ్ రెడ్డి' చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడింది.
ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించిన ఎన్ టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమజంటను విడదీశాడని అనుకుని కోపంతో తిడుతూ దాడి చేసింది.
ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర టీమ్ మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఇది కేవలం సినిమా మాత్రమేనని ఆమెకు తెలియజేశారు. ఎన్ టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ మహిళకు చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.