ఆ అధికారుల పేర్లను రాసి పెట్టండి: పార్టీ నేతలకు కేటీఆర్

  • అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారుల పేర్లను రాసి పెట్టాలన్న కేటీఆర్
  • పైనుంచి వచ్చే ఒత్తిడితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాలన్న కేటీఆర్
  • తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరిక
అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారుల పేర్లను రాసి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పైనుంచి వచ్చే ఒత్తిడితో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులకు మిత్తి (వడ్డీ)తో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. 

ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రైతుల కోసం తాము ఎంత దూరమైనా వెళతామన్నారు. అవసరమైతే జైలుకైనా వెళతామన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రజలు పోలీస్ స్టేషన్ల ముందు వరుస కడితే కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.


More Telugu News