కివీస్‌తో రెండో టెస్టు.. అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డ్!
- డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్
- కివీస్‌తో రెండో టెస్టులో 2వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించిన స్పిన్నర్
- ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 188 వికెట్లు
- ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ (187) ను అధిగమించిన అశ్విన్
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ప్రస్తుతం పూణేలోని ఎంసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండు వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించాడు.
కివీస్ కెప్టెన్ లాథమ్ వికెట్ తీయడంతో ఈ ఘనత అందుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 188 వికెట్లు ఉన్నాయి. దీంతో ఆసీస్ బౌలర్ నాథన్ లయన్ (187) ను అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో కమ్మిన్స్(175), మిచెల్ స్టార్క్(147), స్టువర్ట్ బ్రాడ్(134) ఉన్నారు.
అశ్విన్ డబ్ల్యూటీసీలో 74 ఇన్నింగ్స్‌లలో 20.75 సగటుతో 188 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల హాల్ 11సార్లు నమోదు చేశాడు. మరోవైపు లయన్ 78 ఇన్నింగ్స్‌లలో 26.70 సగటుతో 187 వికెట్లతో 10 ఐదు వికెట్ల హాల్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ అతని కంటే 2,500 బంతులు తక్కువగా బౌలింగ్ చేసినప్పటికీ లయన్‌ను అధిగమించడం విశేషం
డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
రవి అశ్విన్ (భారత్)- 188
నాథన్ లియోన్ (ఆస్ట్రేలియా)- 187
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- 175
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)-147
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్)- 134
ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ విషయానికొస్తే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్టులో భారత్ పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం 0-1తో వెనుకబడి ఉంది. ఈరోజు నుంచి పూణే వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ తీసుకుంది. లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.