తల్లి, చెల్లిపైనే కేసు పెట్టి అథఃపాతాళ లోతుల్లోకి జారిపోయారు.. జగన్‌కు షర్మిల ఘాటు లేఖ
- జగన్ లేఖకు ఘాటుగా బదులిచ్చిన షర్మిల
- తండ్రి రాజశేఖరరెడ్డి ఆదేశాలను, అభిమతాన్ని గాలికి వదిలేశారని మండిపాటు
- తన హక్కుల్ని కాపాడుకునేందుకు తనకున్న మార్గాలను ఎంచుకుంటానని స్పష్టీకరణ
- తన జీవితం ఎలా ఉండాలో నిర్దేశించే హక్కు మీకు లేదని తెగేసి చెప్పిన షర్మిల
- అనవసర వివాదాలతో కుటుంబాన్ని రచ్చకీడ్చడం తగదని హితవు
జగన్ ఇటీవల తనకు రాసిన లేఖకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా బదులిచ్చారు. ఆస్తుల పంపకం విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని అందులో ప్రస్తావించారు. తండ్రి ఆదేశాలను, అభిమతాన్ని గాలికి వదిలేశారని, మాట తప్పి, మడమ తిప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికంగా దిగజారిపోయినా, అథఃపాతాళపు లోతుల నుంచి పైకి వచ్చి, ఇప్పటికైనా మన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, మన మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటే మాత్రం తన హక్కుల్ని కాపాడుకునేందుకు చట్టపరంగా తనకున్న మార్గాలను ఎంచుకుంటానని స్పష్టం చేశారు.
‘ప్రియమైన జగన్ అన్నా’ అంటూ మొదలైన ఆ లేఖ
మీరు ఇటీవల రాసిన లేఖపై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నా. నాన్న రాజశేఖరరెడ్డి తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని ఆదేశించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అప్పట్లో ఆ ఆదేశాలను మీరు అంగీకరించారు. ఆయన మరణించాక మాత్రం మాట తప్పి హామీని గంగలో కలిపారు. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతోపాటు తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని మన తండ్రి నిర్ద్వంద్వంగా ఆదేశించారు. ఇప్పటి వరకు మన మధ్య జరిగిన చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు తల్లి విజయమ్మే సాక్షి. భారతి సిమెంట్స్, సాక్షిలో మెజార్టీ వాటాలు మీరే ఉంచుకోవడం ద్వారా తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చేలానే ఉన్నాయి. మీరు బలవంతులు కావడం వల్ల అరకొర ఆస్తుల్ని తీసుకుని వివాదాన్ని పరిష్కరించేందుకు అంగీకరించాను. తోడబుట్టిన అన్నయ్యతో వివాదం ఇష్టం లేక ఆస్తిలో సమానవాటా పొందేందుకు నాకున్న హక్కును వదులుకునేందుకు అంగీకరించాను. ఆగస్టు 31, 2019లో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు కూడా మీకు మనసు రావడం లేదు. సొంత చెల్లెలు, పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దానికోసం సొంత తల్లిపైనే కేటు పెట్టే స్థాయికి దిగజారారు. మీరు రాసిన లేఖ చట్ట ప్రకారం ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. ఆ లేఖ రాయడం వెనకున్న దురుద్దేశం నన్ను బాధించింది.
నా జీవితం.. నా ఇష్టం
నాన్న ఎప్పుడూ కలలో కూడా ఊహించని పని చేశారు మీరు. ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య, కుమార్తెపై కేసులు పెట్టారు. నా రాజకీయ జీవితం నా ఇష్టం. నా వృత్తిపరమైన వ్యవహారశైలి ఎలా ఉండాలో చెప్పే అధికారం మీకు లేదు. బహిరంగ వేదికలపై మీకు, ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న నిబంధనపై నన్ను సంతకం చేయమని కోరడం అసంబద్ధం. ఎంవోయూలో నా వాటాగా పేర్కొన్న సరస్వతి పవర్లోని షేర్లు మొత్తం ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే నాకు బదలాయిస్తానని హామీ ఇచ్చారు. ఒప్పందం జరిగి సంవత్సరాలు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. ఆ షేర్లను వదులుకోవడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు మీరు అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని రచ్చకీడ్చడం పద్ధతి కాదు’’ అని షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు.