వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబు

  • గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఫంక్షన్ హాలులో నిశ్చితార్థం
  • వెంకయ్య మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ కార్యక్రమం
  • చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ ఫంక్షన్ హాలులో వెంకయ్యనాయుడు మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకకు హాజరైన సీఎం వారికి శుభాకాంక్షలు చెప్పారు. నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును వెంకయ్య సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు, అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం చంద్రబాబు నేరుగా గుంటూరుకు బయలుదేరారు. 
 


More Telugu News