20 ఓవర్లలో 344 పరుగులతో జింబాబ్వే ప్రపంచ రికార్డ్

  • నేపాల్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే
  • గాంబియాపై నాలుగు వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసిన జింబాబ్వే
  • 43 బంతుల్లో 133 పరుగులతో విరుచుకుపడిన కెప్టెన్ సికిందర్ రాజా
ట్వంటీ20 క్రికెట్‌లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్ సృష్టించింది. గత రికార్డులను అన్నింటినీ తుడిచివేస్తూ 20 ఓవర్లలోనే ఏకంగా 344 పరుగులు చేసింది. ట్వంటీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై జింబాబ్వే నాలుగు వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. 2023లో మంగోలియాపై నేపాల్ 20 ఓవర్లలో 314 పరుగులు చేసింది. ఈ రికార్డును జింబాబ్వే తుడిచిపెట్టింది.

ఓపెనింగ్ బ్యాటర్ బ్రియాన్ బాన్నెట్ (50), మారుమణి (62) శుభారంభం ఇచ్చారు. 5.4 ఓవర్లలో 98 పరుగులు చేశారు. మారుమణి 19 బంతుల్లోనే 62 పరుగులు చేశాడు. కెప్టెన్ సికిందర్ రాజా 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్సులతో 133 పరుగులు చేశాడు. జింబాబ్వే తరఫున అంతర్జాతీయ ట్వంటీ20లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సికిందర్ చరిత్ర సృష్టించాడు.


More Telugu News