చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ... మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు

  • పరీవాహక ప్రాంతంలోని నిర్వాసితులను సమస్యలు అడిగి తెలుసుకున్న ఈటల
  • మీ పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయని ఈటలతో చెప్పిన బాధితులు
  • ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తి లేదన్న బాధితులు
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూసీ పరీవాహక ప్రాంతంలోని వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులతో కలిసి ర్యాలీ కూడా తీశారు.

ఈ సందర్భంగా పలువురు బాధితులు ఈటలకు తమ బాధను మొరపెట్టుకున్నారు. మీరు చేసిన పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. అయినప్పటికీ తమకు ఇళ్లు పోతాయేమోననే ఆందోళన ఉందని వాపోయారు. మూసీ సుందరీకరణ కంటే తమ ఇళ్లు తమకు ముఖ్యమని ఈటలతో చెప్పారు. 

ప్రభుత్వ బృందం సియోల్ వెళ్లి తెల్లటి నీళ్లు చూపిస్తోందని, ఇక్కడ కూడా అలా చేస్తే మూసీ పరీవాహక ప్రాంతం నుంచి తాము వెళ్లిపోవడానికి సిద్ధమని వారు ఈటలతో అన్నారు. ప్రభుత్వం పెట్టే టెన్షన్‌కు తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని వాపోయారు. కోట్లాది రూపాయలు ఇచ్చినా... తమ ప్రాణాలు పోయినా ఇళ్లలో నుంచి కదిలేది లేదన్నారు.


More Telugu News