ఆస్తిలో వాటా కోసం తల్లి, సోదరిపై జగన్ కోర్టుకు ఎక్కారు: వంగలపూడి అనిత

  • జగన్ వంటి వారు నీతులు చెప్పే స్థాయిలో లేరన్న అనిత
  • జగన్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
  • టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శ
ఆస్తిలో వాటా కోసం తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై వైసీపీ అధినేత జగన్ కోర్టుకు ఎక్కారని, అలాంటి వారు మాకు నీతులు చెప్పే స్థాయిలో లేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... వారానికి మూడు రోజులు మాత్రమే ఏపీకి సమయం ఇచ్చి జగన్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టైంపాస్ రాజకీయాల కోసం ఏపీకి వచ్చి అసత్యాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వివిధ కేసుల్లో ఉన్న జగన్... తాను సీఎంను అని చెప్పి గతంలో కోర్టు వాయిదాలను ఎగ్గొట్టారన్నారు.

కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఉచిత గ్యాస్ సిలిండర్ అంశంపై మాట్లాడుతూ... సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.2,680 కోట్ల భారం పడుతుందని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.


More Telugu News