రంగారెడ్డి మాజీ కలెక్టర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ

  • భూకేటాయింపు అక్రమాలపై అమోయ్ కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ
  • ఏడున్నర గంటల పాటు వివిధ అంశాలపై ఈడీ ప్రశ్నలు
  • ఉదయం మీడియా కంటపడకుండా ఈడీ కార్యాలయానికి అమోయ్
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈడీ ఏడున్నర గంటల పాటు విచారించింది. రంగారెడ్డి జిల్లాలో భూకేటాయింపులపై అక్రమాలు జరిగాయన్న కేసులో అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మీడియా కంటపడకుండా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు.

ఈడీ అధికారులు ఆయనను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారించారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే 42 ఎకరాల భూమిని అక్రమంగా ఎలా బదిలి చేశారని ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు.


More Telugu News