కొత్త ప్రాజెక్టులతో అక్కినేని అఖిల్ రెడీ!
- ఒకేసారి రెండు సినిమాలను అంగీకరించిన అఖిల్
- వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాలు
- మళ్లీ కొత్త దర్శకులకే అవకాశం ఇచ్చిన అఖిల్
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ 'అఖిల్' సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమానే ఈ నట వారసుడిని నిరాశ పరిచింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, ఏజెంట్ చిత్రాల్లో నటించినా ఇందులో ఏ చిత్రం కూడా అఖిల్‌కు కావాల్సిన కమర్షియల్ సక్సెస్‌ను అందించలేకపోయింది.
ఈ హీరో నటించిన గత సినిమా 'ఏజెంట్' బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర గడుస్తున్నా అఖిల్ మరో చిత్రం అంగీకరించలేదు. గత కొంతకాలం నుండి ఎన్నో కథలను వింటున్నా ఈ కథానాయకుడు ఏ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ఈ అక్కినేని వారసుడు రెండు చిత్రాల్లో నటించడానికి పచ్చజెండా ఊపాడట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లబోతున్నాయని తెలిసింది.
అందులో ఒకటి యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోయే 'ధీర' చిత్రం కూడా వుంది. అనిల్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. దీంతో పాటు తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో కూడా ఓ సినిమా అఖిల్ చేయనున్నాడు. ఈ చిత్రానికి 'వినరో భాగ్యం విష్ణు కథ' దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ రెండు సినిమాలు కూడా ఏకకాలంలోనే చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.