రోహిత్ ఆటోగ్రాఫ్ తీసుకున్న యువతి.. కోహ్లీకి కూడా చెప్పాలని వినతి.. హిట్‌మ్యాన్ రిప్లై ఇదే!
- రెండో టెస్టు కోసం పూణేలో దిగిన భారత జట్టు
- ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కి వెళుతున్న రోహిత్‌ను ఆటోగ్రాఫ్ అడిగిన యువతి
- ఆటోగ్రాఫ్ ఇస్తుండగా కోహ్లీకి అతిపెద్ద అభిమానినని చెప్పిన యువతి
- ఈ విషయం విరాట్‌కు చెప్పాలని అడిగిన మహిళా ఫ్యాన్
- తప్పకుండా చెబుతానంటూ హిట్‌మ్యాన్ రిప్లై
పూణే వేదికగా గురువారం నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ప్రారంభం కానుంది. దీంతో భారత జట్టు ఇప్పటికే పూణే చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టింది. ఈ క్రమంలో మంగళవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రాక్టీస్ సెషల్ ముగించుకుని డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళుతున్న సమయంలో ఓ యువతి ఆటోగ్రాఫ్ అడిగింది. దాంతో హిట్‌మ్యాన్ ఆ మహిళా అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.
అలా హిట్‌మ్యాన్ ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో యువతి ఒక విషయం చెప్పింది. కోహ్లీతో నీ అతిపెద్ద అభిమాని ఇక్కడికి వచ్చిందంటూ చెప్పమని రోహిత్‌ను అడిగింది. దాంతో రోహిత్ తప్పకుండా చెబుతాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతే.. మహిళా అభిమానితో రోహిత్ సంభాషణ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలాఉంటే.. పూణేలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టు కోసం భారత్ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో మెడ నొప్పి కారణంగా దూరమైన శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉన్నాడని, రిషబ్ పంత్ కూడా పూర్తిగా కోలుకున్నట్లు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్‌చేట్ తెలిపారు. అయితే, ఫామ్‌లేక తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్థానంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. తొలి టెస్టులో గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం సర్ఫరాజ్ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. అందుకే రాహుల్ స్థానంలోనే గిల్ బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.
ఇక బెంగళూరులో మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. దాంతో రెండో టెస్టులో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని టీమిండియా భావిస్తోంది. దానికోసం నెట్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.