రజనీ సర్ సూచన వల్లే అలాంటి సినిమాల్లో నటించగలిగాను: సూర్య
- రజనీకాంత్ సూచనలతో తన ఆలోచనలో మార్పు వచ్చిందన్న సూర్య
- అన్ని రకాల సినిమాలు చేయడానికి ప్రయత్నించమని రజనీకాంత్ సలహా ఇచ్చారని వెల్లడి
- సింగం లాంటి యాక్షన్ ఫిల్మ్‌లో, జై భీమ్ లాంటి లీగల్ డ్రామాలోనూ నటించానని తెలిపిన సూర్య
కెరీర్ పరంగా తన ఆలోచనలో మార్పు రావడానికి కారణం రజనీకాంత్ అని హీరో సూర్య తెలిపారు. తన కొత్త మూవీ ‘కంగువా’ ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రజనీకాంత్ తనకు చేసిన కీలక సూచన విషయాన్ని సూర్య వెల్లడించారు.
కొన్నాళ్ల క్రితం తాను, రజనీకాంత్ సర్ ఒకే విమానంలో ప్రయాణించామని, ఆ సమయంలో పలు విషయాలపై చర్చించుకున్నామని సూర్య చెప్పారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి ‘మీలో స్టార్ మాత్రమే కాదు, మంచి నటుడు ఉన్నాడు. అందుకే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకే పరిమితమై కంఫర్ట్ జోన్‌లో ఉండకండి. అన్ని రకాల మూవీలు చేయడానికి ప్రయత్నించండి’ అని సూచించారన్నారు. రజనీ సర్ సూచనల నేపథ్యంలో తన ఆలోచనలో మార్పు వచ్చిందన్నారు. ఆయన చెప్పిన సూచనల వల్లే సింగం లాంటి యాక్షన్ ఫిల్మ్‌లో, జై భీమ్ లాంటి లీగల్ డ్రామాలోనూ నటించడం జరిగిందని తెలిపారు.
రెండు చిత్రాల్లో వైవిధ్యం ఎలా చూపించావని తన కుమార్తె చాలా సార్లు తనను అడిగిందని సూర్య తెలిపారు. కంగువా స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శివ చెప్పినప్పుడు తాను కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నానని అనిపించిందన్నారు. లార్జర్ డేన్ లైఫ్ ‘బాహుబలి’, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు ఇప్పటికే చూశామనీ, ఆ విషయంలో కోలీవుడ్‌లో కంగువాతో తొలి అడుగు వేసినట్లు భావిస్తున్నామన్నారు. తమిళ్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి మూవీ రాలేదని సూర్య పేర్కొన్నారు. కాగా, కంగువా చిత్రం నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. త్రీడీలోనూ ఇది విడుదల కానుంది.