సినీ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్

  • 84 ఎకరాల భూమిని కాజేసేందుకు యత్నించిన శివరామకృష్ణ
  • 2003లోనే కోర్టులో కేసు వేసిన ఆనాటి ప్రభుత్వం
  • శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చిన సుప్రీంకోర్టు
టాలీవుడ్ సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో శివరామకృష్ణ నకిలీ పత్రాలను సృష్టించారు. ఆ తర్వాత బిల్డర్ మారగొని లింగంగౌడ్ సాయంతో ఆ స్థలం తనదేనని చెప్పుకున్నారు. 

ఈ స్థలం గొడవపై 2003లోనే ఆనాటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు శివరామకృష్ణవి నకిలీ పత్రాలేనని తేల్చింది. ఈ నేపథ్యంలో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగంగౌడ్ పై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామకృష్ణ గతంలో రవితేజతో 'దరువు' సినిమాతో పాటు పలు చిత్రాలను నిర్మించారు.


More Telugu News