చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై విచారణ పూర్తి... తీర్పు రేపటికి వాయిదా
- తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు
- భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో హైకోర్టుకు చెన్నమనేని రమేశ్
- హైకోర్టులో విచారణ.. వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని కాంగ్రెస్ నేత, వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కేంద్రం 2017లో రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది.
ఆయన హైకోర్టును ఆశ్రయించగా, పునఃపరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పునఃపరిశీలించిన కేంద్రం... తమ నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం నిర్ణయంపై స్టే ఇచ్చిన హైకోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. ఈరోజు వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.