విజయవాడ పున్నమి ఘాట్ లో డ్రోన్ షోకి హాజరైన సీఎం చంద్రబాబు
- అమరావతిలో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్
- ఈ ఉదయం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- నేటి సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద భారీ డ్రోన్ షో
- సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారిన పున్నమి ఘాట్
- ఆసక్తిగా తిలకించిన సీఎం చంద్రబాబు
అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా ఈ సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ డ్రోన్ షోలో 5 వేల డ్రోన్లతో వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించనున్నారు.
ఇక, డ్రోన్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఈ డ్రోన్ షోకి ఆహ్వానించడంతో, పున్నమి ఘాట్ వద్ద భారీ కోలాహలం నెలకొంది.
ఏపీ రాజధాని అమరావతిలో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ భారీ ఈవెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.