మాల్‌కు సంబంధించి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి మరోసారి షాక్
- రూ.45.46 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు
- మాల్‌ను స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
- హైకోర్టు ఆదేశాల మేరకు మాల్ స్వాధీనం
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అధికారులు షాకిచ్చారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలోని ఆయన మాల్‌కు సంబంధించి ఫైనాన్స్ కార్పోరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ మాల్... బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
అర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని జీవన్ రెడ్డి అద్దెకు తీసుకొని అందులో షాపింగ్ మాల్ నిర్మించాడు. ఆయన కొంతకాలంగా షాపింగ్ మాల్ అద్దె కట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. షాపింగ్ మాల్‌కు చెందిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జీవన్ రెడ్డికి అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
షాపింగ్ మాల్ బకాయిలను వెంటనే చెల్లించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించని కారణంగా ఈ మాల్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మాల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బకాయిలు చెల్లించాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.