సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆగ్రహం... స్పందించిన కేటీఆర్
- శాంతిభద్రతల్లేవని అందరూ చెబుతున్న మాటనే జీవన్ రెడ్డి చెప్పారన్న కేటీఆర్
- పూర్తిస్థాయి హోంమంత్రి లేకపోవడం వల్లే శాంతిభద్రతల సమస్య అన్న కేటీఆర్
- సమర్థులైన పోలీస్ అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానన్న బీఆర్ఎస్ నేత
కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత కార్యకర్తలకే భరోసా లేదన్న ఆ పార్టీ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్పారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి లేరని... పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో శాంతిభద్రతల అమలు కుంటుపడిందని ఆరోపించారు. రాజకీయ పెద్దలు ఇకనైనా విజ్ఞతతో ఆలోచిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
శాంతిభద్రతలు కాపాడే ప్రాథమిక పనిపై దృష్టి సారించేలా సమర్థులైన పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య నేపథ్యంలో సొంత పార్టీ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదన్నారు. తాను ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేనని వాపోయారు.