వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అనూహ్య ఘటన
- ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ
- బీజేపీ ఎంపీ అభిజిత్, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం
- గాజుతో తయారైన వాటర్ బాటిల్ విసిరిన కల్యాణ్ బెనర్జీ
- ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీకి గాయాలు
- ఆసుపత్రికి తీసుకెళ్లిన ఒవైసీ, సంజయ్ సింగ్
ఢిల్లీలో నేడు వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో సహనం కోల్పోయిన ఎంపీ కల్యాణ్ బెనర్జీ టేబుల్ పై ఉన్న గాజుతో తయారైన వాటర్ బాటిల్ ను విసిరారు.
ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ బొటనవేలు, చిటికెనవేలుకి గాయాలయ్యాయి. ఆయనను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీకి వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఈ ఘటనతో జాయింట్ పార్లమెంటరీ సమావేశానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది.