రేవంత్ రెడ్డిని ఎలా తిట్టాలో ఆయన వద్దే శిక్షణ తీసుకో: కేటీఆర్ కు జగ్గారెడ్డి సలహా
- "మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి" అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి
- కేటీఆర్ దండుపాళ్యం నాయకుడని విమర్శ
- రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకుంటే కేటీఆర్ తట్టుకోలేడన్న జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డిని ఎలా తిట్టాలో... ఎలా అటాక్ చేయాలో... ఆయన వద్దకే వెళ్లి శిక్షణ తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి చురక అంటించారు. నీకు ట్రెయినింగ్ కావాలంటే తాను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి ఇప్పిస్తానన్నారు. మిమ్మల్ని ఎలా టార్గెట్ చేయాలో కేటీఆర్‌కు అర్థం కావడం లేదు... మీరే ప్రత్యేకంగా క్లాస్ ఇవ్వండని తాను ముఖ్యమంత్రికి చెబుతానన్నారు.
గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ దండుపాళ్యం నాయకుడని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కూడా దండుపాళ్యం బ్యాచ్‌లా మారిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి సీఎం స్థాయికి వచ్చాడన్నారు. పేదప్రజల బాధలు ఆయనకు తెలుసునన్నారు.
ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తిట్లదండకం అందుకుంటే కేటీఆర్ తట్టుకోలేడన్నారు. కేటీఆర్ ఓ నాజూకు లీడరని ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి కేసీఆర్‌కు మాత్రం బాధలు తెలుసునని... ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయంగా పైకి ఎదిగారన్నారు. కానీ కేటీఆర్ అలా కాదన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. కేసులు, పోలీసులు అంటూ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం తమకు అవసరం లేదన్నారు.
వికారాబాద్ జిల్లాలోని దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శలు పిల్లచేష్టలన్నారు. కనీస రాజకీయ అవగాహన లేని నాయకుడని మండిపడ్డారు. ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఫండింగ్ చేసిందని ఆరోపించారు. కర్ణాటకలో కుమారస్వామి పార్టీకి ఫండింగ్ చేయలేదా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు కూడా పంపినందుకే బీజేపీ ఆయన చెల్లి కవితను జైల్లో పెట్టిందన్నారు. నవీన్ పట్నాయక్‌కు కూడా ఫండింగ్ చేశారని ఆరోపించారు. కానీ తమ పార్టీపై నిందలు వేయడం ఏమిటన్నారు.