చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణలపై యాంకర్ శ్యామల విమర్శలు
- కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న శ్యామల
- మహిళలపై దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు బాధ లేదని విమర్శ
- రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మళ్లీ వస్తోందని వ్యాఖ్య
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై బుల్లితెర యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆమె ఆరోపించారు. కూటమి పాలనలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని అడిగారు. ఒక మహిళగా, ఒక తల్లిగా హోం మంత్రి అనిత కూడా సరైన విధంగా స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఎన్నో దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కొంచెం కూడా బాధ లేదని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశ యాప్ ను తీసుకొచ్చామని... ఆ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలకు న్యాయం జరిగిందని శ్యామల అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో కూటమి ప్రభుత్వం ఆ యాప్ ను పక్కన పెట్టేసిందని విమర్శించారు. జగన్ కు మంచి పేరు వస్తుందని ఆ యాప్ పై బురదచల్లారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మళ్లీ వస్తోందని అన్నారు.