ఏపీని డ్రోన్ హబ్‌గా మార్చడమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
- మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా అమరావతి డ్రోన్ సమ్మిట్-2024
- సీఎం చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభమైన సమ్మిట్
- డ్రోన్స్... ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్ అన్న చంద్రబాబు
- ఇకపై డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుందని వ్యాఖ్య
- మరో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ తీసుకువస్తామని వెల్లడి
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా ఈ సమ్మిట్ ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జాతీయస్థాయిలో జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. డ్రోన్ల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్‌లో ఉండేలా ఈ సదస్సు తొలి అడుగు కావాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మొదటిది అని తెలిపారు. అలాగే డ్రోన్స్ అనేవి ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్ అని పేర్కొన్నారు.
ఏపీని డ్రోన్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ వరదల సమయంలో డ్రోన్ సేవలు కీలకంగా మారాయని గుర్తు చేశారు. రెస్క్యూ బృందాలు కూడా చేరుకోలేని చోటుకు డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, మెడిసిన్స్, తాగునీరు అందజేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనూ డ్రోన్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే లైవ్ విజువల్స్‌తో సహా నిమిషాల్లో పట్టుకుని శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఇకపై డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుందన్నారు. మరో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు. దీంతో పాటు డ్రోన్ సర్టిఫికేట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారు. డ్రోన్ కంపెనీలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ తమ ప్రభుత్వ విధానమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.