డ్రోన్ స‌మ్మిట్ ప్రారంభం

  • మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ వేదిక‌గా 'అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024' 
  • స్వ‌యంగా ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు  
  • ఈ స‌మ్మిట్ రెండు రోజుల‌పాటు జాతీయ‌స్థాయిలో జ‌రుగుతుంద‌ని అధికారుల వెల్ల‌డి
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌డుతున్న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024 ప్రారంభ‌మైంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు చేతుల‌మీదుగా మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ వేదిక‌గా ఈ స‌మ్మిట్‌ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా డ్రోన్ల వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే టాప్‌లో ఉండేలా ఈ స‌ద‌స్సు తొలి అడుగు కావాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. 

రెండు రోజుల‌పాటు ఈ స‌మ్మిట్ జాతీయ‌స్థాయిలో జ‌రుగుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 50 స్టాళ్ల‌లో డ్రోన్ల ప్ర‌ద‌ర్శ‌న‌, రాష్ట్ర ముసాయిదా డ్రోన్ పాల‌సీ ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌, తొమ్మిది ప్యాన‌ల్ డిస్క‌ష‌న్లు త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని తెలిపారు.  


More Telugu News