పాకిస్థాన్‌కు చెందిన కొత్త ఉగ్రవాద గ్రూపును తుదముట్టించిన జమ్మూకశ్మీర్ సీఐకే

  • ఆదివారం ఒక డాక్టర్, ఆరుగురు వలస కూలీలను హత్య చేసిన ఉగ్రవాదులు
  • పలు జిల్లాల్లో మేజర్ ఆపరేషన్ నిర్వహించిన జమ్మూకశ్మీర్ పోలీసులు
  • లష్కరే సంస్థకు చెందిన ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ నామరూపాల్లేకుండా చేసిన పోలీసులు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఓ మేజర్ పోలీస్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ నామరూపాల్లేకుండా పోయింది. శ్రీనగర్, గండెర్బల్, బండీపుర, కుల్గాం, బుద్గాం, అనంతనాగ్, పుల్వామా జిల్లాల్లో జమ్మూకశ్మీర్‌ పోలీస్‌కు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ (సీఐకే) మేజర్ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ సందర్భంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన శాఖ ‘తెహ్రీక్ లబైక్ య ముస్లిం’ (టీఎల్ఎం)ను నామరూపాల్లేకుండా చేశారు. ఈ సంస్థను పాకిస్థాన్ నుంచి ‘బాబా హమాస్’ అనే వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఒక డాక్టర్, ఆరుగురు వలస కార్మికులను హత్య చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. 


More Telugu News