ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా-ఏ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

  • 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ప్ర‌క‌టించిన‌ బీసీసీఐ 
  • ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టుతో రెండు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచులు ఆడ‌నున్న భార‌త‌-ఏ జ‌ట్టు
  • అలాగే భార‌త సీనియ‌ర్‌ జ‌ట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్
  • జ‌ట్టులో నితీశ్‌ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్, ఇషాన్ కిష‌న్‌కు చోటు
రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ఎంపిక చేసింది. ఈ టూర్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. బెంగాల్‌కు చెందిన‌ అభిమన్యు ఈశ్వరన్ ఈ రెడ్ బాల్ టూర్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. 

రుతురాజ్ సార‌థ్యంలోని భార‌త-ఏ జ‌ట్టు... ఆస్ట్రేలియా-ఏ జ‌ట్టుతో రెండు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచులు, భార‌త జ‌ట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడ‌నుంది. కాగా, తాజాగా ఎంపిక చేసిన ఇండియా-ఏ జ‌ట్టులో యువ ఆట‌గాళ్లు నితీశ్‌ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవదీప్ సైనీ, ఇషాన్ కిషన్, అభిషేక్ పోరెల్ వంటి వారికి చోటు ల‌భించింది.

15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏతో మాకే, మెల్‌బోర్న్‌లలో రెండు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడతారు. అలాగే పెర్త్‌లో టీమ్ ఇండియా (సీనియర్ జ‌ట్టు)తో జరిగే మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడ‌తార‌ని బీసీసీఐ కార్యదర్శి జైషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆస్ట్రేలియా పర్యటనకు భారత-ఏ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, నితీశ్‌ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), ముఖేశ్‌ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్‌ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుశ్‌ కోటియన్.

షెడ్యూల్:
  • అక్టోబర్ 31 నుండి నవంబర్ 3 వరకు: 1వ ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌- జీబీఆర్ఏ, మాకే
  • నవంబర్ 7 నుండి 10 వరకు: 2వ ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌- ఎంసీజీ, మెల్బోర్న్
  • నవంబర్ 15 నుండి 17 వరకు: ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్- డ‌బ్ల్యూసీఏ, పెర్త్


More Telugu News