రష్యా బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్న ప్రధాని
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సభ్య దేశాల అధినేతలత ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్న మోదీ
- చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీకి అవకాశం
అత్యంత కీలకమైన ‘బ్రిక్స్’ 16వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా బయలుదేరారు. కజాన్ నగరంలో జరుగుతున్న సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇతర బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో కూడా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్య ఆసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది.
బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండవసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను అందుకున్నారు.