తిరుమలలో శ్రీవారి ఆలయంపై ఎగిరిన హెలికాప్టర్
- తిరుమల కొండపై తరచూ హెలికాప్టర్ చక్కర్లు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు
- కొండపై నుంచి తాజాగా వెళ్లిన హెలికాప్టర్‌పై ఏవియేషన్ అధికారులకు టీటీడీ ఫిర్యాదు
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్‌లో ఉంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా కొండపై తరచుగా విమానాలు, హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లడం, హెలికాప్టర్‌లు చక్కర్లు కొట్టడం జరుగుతోంది. ఈ ఘటనలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాజాగా సోమవారం కొండపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలాన్ని రేపింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనే దానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు హెలికాప్టర్ తిరుమల కొండపై నుండి వెళ్లడంపై ఏవియేషన్ అధికారులకు టీటీడీ ఫిర్యాదు చేసింది.