యాదాద్రిలో రీల్స్... బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు
- యాదాద్రి ఆలయంలో రీల్స్ చేశారని వీహెచ్‌పీ నేత ఫిర్యాదు
- వీహెచ్‌పీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు
- ఆలయ మాడవీధుల్లో భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్‌లోని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాదాద్రి ఆలయంలో బీఆర్ఎస్ నేత రీల్స్ చేశారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత సుభాష్ చంద్ర ఫిర్యాదు చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని సుభాష్ చంద్ర కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో తన భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయినప్పటికీ కౌశిక్ రెడ్డి రీల్స్ తీసినట్టు ఆరోపణలు వచ్చాయి.