డీజీపీకి చేతులెత్తి నమస్కరించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
- పోలీస్ అధికారులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఘటన
- త్వరగా రిక్రూట్‌మెంట్ జరిగేలా చూస్తారా? అంటూ డీజీపీని అడిగిన సీఎం
- సీఎంకు సెల్యూట్ చేసి... ఆదేశాలు అమలు చేస్తామని చెప్పిన డీజీపీ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర డీజీపీకి చేతులెత్తి నమస్కరించారు. ఇది అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కొత్తగా ఎంపికైన 1,239 మంది పోలీస్ అధికారులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. నియామక పత్రాలు అందించిన అనంతరం నితీశ్ కుమార్ మాట్లాడారు. ప్రసంగం మధ్యలో ఆగి డీజీపీ అలోక్ రాజ్ వైపు చూస్తూ... త్వరగా రిక్రూట్‌మెంట్ జరిగేలా చూస్తారా? అని చేతులు జోడించి అడిగారు. దీంతో షాకైన డీజీపీ ప్రతిగా ఆయనకు సెల్యూట్ చేశారు.
అనంతరం అలోక్ రాజ్ మైక్ వద్దకు వెళ్లి, ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారన్నారు. త్వరితగతిన రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి పటిష్టమైన శిక్షణ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.