ఒకవైపు ప్రమోషన్.. మరోవైపు షూటింగ్... రామ్‌చరణ్ న్యూ ప్లానింగ్
- నవంబరులో గేమ్ ఛేంజర్ ప్రమోషన్ ప్రారంభం
- దేశంలోని ప్రధాన నగరాల్లో రామ్‌చరణ్ ప్రమోషన్
- నవంబరులో ఆర్‌సీ 16 చిత్రీకరణ షురూ
ఆర్‌ఆర్‌ఆర్ తరువాత రామ్‌చరణ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్, శంకర్ కలయికలో గేమ్ ఛేంజర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ కార్యక్రమాలతో పాటు నిర్మాణానంతర పనులు కూడా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్ క్యాలెండర్‌ను నిర్మాత దిల్‌రాజు రెడీ చేసినట్లుగా తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ టూర్‌ను సిద్దం చేశారు.
నవంబరు నెలాఖారు నుంచి గేమ్ ఛేంజర్ పబ్లిసిటి మొదలుకానుంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో రామ్‌చరణ్ పర్యటించనున్నారు. అయితే దీంతో పాటు రామ్‌చరణ్ నటించనున్న ఆర్‌సీ 16 చిత్రం కూడా నవంబరులోనే ప్రారంభం కానుంది. జాన్వీ కపూర్ నాయికగా నటించనున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకుడు.
ఈ చిత్రం మేకోవర్‌లో భాగంగా శరీరాకృతి కోసం రామ్ చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే నవంబరు, డిసెంబరు, జనవరిలో ఒకవైపు ఈ సినిమా చిత్రీకరణతో పాటు మరో వైపు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌తో బిజీ కాబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా ఆయన టీమ్ రెడీ చేసినట్టు తెలిసింది.