రుషికొండ భవనాలను ఆకస్మికంగా పరిశీలించిన పవన్ కల్యాణ్
- విజయనగరం జిల్లాలో డయేరియాపై సమీక్ష
- తిరుగు ప్రయాణంలో విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్
- స్థానిక నేతలతో కలిసి రుషికొండ భవనాల పరిశీలన
ఇవాళ విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా పరిస్థితులను సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. అక్కడి రుషికొండ భవనాలను ఆకస్మికంగా పరిశీలించారు. రుషికొండపై ఉన్న టూరిజం విభాగం భవనాలన్నీ కలియదిరిగారు. అధికారులను అడిగి ఆ భవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన నేతలతో పాటు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం, పవన్ కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన నేతలతో పాటు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం, పవన్ కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.