వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ పవన్ కల్యాణ్ కు సమన్లు
- తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ వ్యాఖ్యలపై పిటిషన్
- హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పిటిషన్ వేసిన న్యాయవాది రామారావు
- నవంబర్ 22న కోర్టుకు హాజరు కావాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో ఈ సమన్లు జారీ చేసింది.
లడ్డూ నాణ్యతపై పవన్ చేసిన వ్యాఖ్యలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రామారావు అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా లడ్డూ నాణ్యతపై వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్ లో రామారావు పేర్కొన్నారు.
మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పవన్ కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.