హోం మంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారు: వైఎస్ అవినాశ్ రెడ్డి

  • బద్వేల్ లో హత్యకు గురైన విద్యార్థిని
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన అవినాశ్ రెడ్డి
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్న
మహిళల రక్షణ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని... దీనిపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడాలని చెప్పారు. బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను అవినాశ్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు 74 జరిగాయని అవినాశ్ చెప్పారు. అన్ని చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేము కదా? అంటూ హోం మంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దిశ చట్టం, దిశ యాప్ ఉంటే 10 నిమిషాల్లో పోలీసులు స్పాట్ కి వెళ్లేవారని చెప్పారు. దిశ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. 


More Telugu News