తెలంగాణ పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
- వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు రూ.1కోటి నష్టపరిహారం
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
- ఎస్ఐ, సీఐ స్థాయి అధికారికి రూ. 1.25 కోట్ల పరిహారం
- డీఎస్‌పీ, అడిషనల్ ఎస్‌పీ, ఎస్‌పీలు వీరమరణం పొందితే రూ. 1.50కోట్లు
- ఐపీఎస్‌లకు రూ.2కోట్లు పరిహారంగా ఇస్తామన్న సీఎం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై వరాల జల్లు కురిపించారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు రూ.1కోటి నష్టపరిహారంగా ఇస్తామని ప్రకటించారు.
గోషామహల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా అమరవీరుల ఫ్యామిలీలకు ఇచ్చే నష్టపరిహారంపై కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందితే కోటి రూపాయలు.. అదే ఎస్ఐ, సీఐ స్థాయి అధికారికి రూ. 1.25 కోట్లు ఇస్తామన్నారు.
ఇక డీఎస్‌పీ, అడిషనల్ ఎస్‌పీ, ఎస్‌పీలు వీరమరణం పొందితే రూ. 1.50కోట్లు, ఐపీఎస్‌లకు రూ.2కోట్లు పరిహారంగా ఇస్తామని తెలిపారు. అంతేగాక వారి కుటుంబంలో అర్హతను బట్టి గవర్నమెంట్ జాబ్ కూడా ఇస్తామన్నారు. అలాగే శాశ్వత అంగవైకల్యం పొందిన అధికారుల ర్యాంకు ఆధారంగా రూ.50లక్షల వరకు నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.