నా కుమారుడిని అక్రమంగా హత్య కేసులో ఇరికించారు: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్

  • చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్తే అన్న విశ్వరూప్
  • కేసులోని నిందితులతో తన కుమారుడి పేరు చెప్పించారని మండిపాటు
  • మధురై నుంచి వస్తుండగా అరెస్ట్ చేశారన్న విశ్వరూప్
మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కక్షతో తన కుమారుడిని అక్రమంగా హత్య కేసులో ఇరికించారని మండిపడ్డారు. కావాలనే తన కుమారుడిని ఇరికించారని అన్నారు. హత్య కేసుతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

చనిపోయిన వ్యక్తి తమ వైసీపీ పార్టీ కార్యకర్తేనని విశ్వరూప్ తెలిపారు. ఎఫ్ఐఆర్ లో కూడా తన కుమారుడి పేరు ఎక్కడా లేదని చెప్పారు. రాజకీయ కక్షతో... ఈ కేసులోని నిందితులతో తన కుమారుడి పేరు చెప్పించి, తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. మధురైలోని ఆలయ దర్శనానికి వెళ్లి వస్తున్న తన కుమారుడిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు.


More Telugu News