పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తెలంగాణ జనసేన నేతలు

  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జనసేన నేతల మీడియా సమావేశం
  • మీడియాతో మాట్లాడిన నేమూరు శంకర్ గౌడ్, ఆర్.రాజలింగం
  • పవన్ గురించి పలు అంశాల వివరణ
తెలంగాణ జనసేన నేతలు నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ కు యావత్ తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరు శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆర్.రాజలింగం మాట్లాడారు. 

పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని చెబుతుంటారని గుర్తుచేశారు. ఏ కార్యక్రమం చేపట్టినా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేయడం పవన్ కు సెంటిమెంట్ గా మారిందని వివరించారు. ఏపీ ఎన్నికలకు ముందు వారాహి వాహనానికి సైతం కొండగట్టు హనుమాన్ దేవాలయం వద్దనే పూజలు నిర్వహించడం అందుకు నిదర్శనం అని వారు వెల్లడించారు. 

కొండగట్టు అంజన్న ఆలయం వద్ద భక్తుల వసతి సౌకర్యం కోసం 100 గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి నిధులు కేటాయించడం పవన్ కృషి వల్లే సాధ్యపడిందని తెలంగాణ జనసేన నేతలు స్పష్టం చేశారు. 

ఈ మీడియా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ జనసేన ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, వీర మహిళా విభాగం చైర్మన్ మండపాక కావ్య, ప్రధాన కార్యదర్శి శిరీష పొన్నూరు, ఉపాధ్యక్షురాలు నిహారిక, ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడికొండ లిఖిత తదితరులు పాల్గొన్నారు.


More Telugu News