దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం: మంత్రి నాదెండ్ల

  • ఎన్నికల వేళ సూపర్ సిక్స్ హామీలు
  • ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తీసుకుంటామన్న మంత్రి నాదెండ్ల
  • ఈ పథకానికి ఏడాదికి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని వెల్లడి
మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. ఇప్పుడా హామీ నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. 

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా... దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన వారికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏడాదికి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. 

త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తీసుకుంటామని పేర్కొన్నారు.


More Telugu News