రేపు విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
- గుర్ల గ్రామంలో విజృంభించిన డయేరియా
- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ప్రజలు
- ఒక్కరోజులోనే నలుగురి మృతి
- స్వయంగా పరిస్థితిని సమీక్షించనున్న పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు (అక్టోబరు 21) విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిన నేపథ్యంలో, పవన్ ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో సమీక్షిస్తారు. గ్రామంలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్నారు.
గత కొన్నిరోజులుగా విజయనగరం జిల్లాలోని మండలకేంద్రమైన గుర్ల గ్రామంలో డయేరియా విజృంభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఒక్కరోజులోనే నలుగురు మృతి చెందడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీశారు. ఈ క్రమంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పరిస్థితులను సమీక్షించనున్నారు.