గుర్ల గ్రామంలో జరిగింది సహజ మరణాలు కాదు: కూటమి ప్రభుత్వంపై బొత్స విమర్శలు

  • విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిందన్న బొత్స
  • ఇవి సహజ మరణాలు కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు
  • మృతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిపోయిందంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. డయేరియా కారణంగా 16 మంది చనిపోయారని మండిపడ్డారు. ఇవి సహజ మరణాలు కాదని, ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలు అని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. 

గ్రామాల్లో పారిశుద్ధ్యం దిగజారిందని, తాగునీటి సరఫరా సరిగా లేదని, అందుకే డయేరియా ప్రబలిందని విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఇవాళ గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను కలిసి పరామర్శించిన అనంతరం బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News