రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా
- వైఎస్సార్ జిల్లాలో ఘోరం
- ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు
- చికిత్స పొందుతూ మృతి చెందిన అమ్మాయి
- రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయిందన్న రోజా
వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై మాజీ ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో స్పందించారు.
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వరుస అత్యాచారాలు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను 'అత్యాచారాంధ్రప్రదేశ్'గా మార్చేసిందని విమర్శించారు.
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో ఆడబిడ్డ కన్నుమూసిందని పేర్కొంటూ... మృతురాలి తల్లి భోరున విలపిస్తున్న వీడియోను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోదిస్తున్న ఆ కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా? అంటూ చంద్రబాబు, హోంమంత్రి అనిత, పవన్ కల్యాణ్ లను ప్రశ్నించారు.