జగన్ కల్తీ మద్యం వల్ల 50 లక్షల మంది లివర్, కిడ్నీ సమస్యలకు గురయ్యారు: మంత్రి కొల్లు రవీంద్ర

  • జగన్ వ్యాఖ్యలకు కొల్లు రవీంద్ర కౌంటర్
  • ఆదాయం పోయిందన్న బాధతో జగన్ దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్
  • తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరని స్పష్టీకరణ
ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ కల్తీ మద్యం వల్ల 50 లక్షల మంది లివర్, కిడ్నీ సమస్యలకు గురయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారని, సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి బాటలు వేసుకున్నారని విమర్శించారు. 

వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసి ఇప్పుడు మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయని నీతులు చెబుతున్నారు... సిగ్గుండాలి అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల పాలనపై జగన్ చర్చకు రాగలరా? అని సవాల్ విసిరారు. ఆదాయం పోయిందన్న అక్కసుతో జగన్ దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 

ఇసుక విషయంలోనూ జగన్ దోపిడీకి పాల్పడ్డారని, రూ.1000 కోట్ల మేర ప్రజధనాన్ని జగన్ లూటీ చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు సహించరన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు.


More Telugu News