గుంటూరు ప్రత్యేక కోర్టులో నకిలీ నిందితుడు... గుర్తించిన న్యాయమూర్తి
- 2020లో నందిగం సురేశ్ సోదరుని నివాసంపై దాడి
- ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేశ్వరరావు
- వెంకటేశ్వరరావు స్థానంలో కోర్టుకు హాజరైన సునీల్
- వెంటనే గుర్తించిన న్యాయమూర్తి శరత్ బాబు
అసలు నిందితుడి స్థానంలో నకిలీ నిందితుడు కోర్టుకు హాజరైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. న్యాయ వ్యవస్థనే ఏమార్చే ఈ ప్రయత్నం నివ్వెరపరుస్తోంది. గుంటూరు ప్రత్యేక కోర్టును మోసం చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా, న్యాయమూర్తి ఆ వ్యక్తిని గుర్తించారు. ఈ కేసు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడికి సంబంధించినది కావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే... 2020లో నందిగం సురేశ్ సోదరుని నివాసంపై దాడి కేసులో గుంటూరు స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసులో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నిందితుడిగా ఉండగా, అతడి స్థానంలో సునీల్ అనే మరో వ్యక్తి విచారణకు హాజరయ్యాడు.
అయితే, న్యాయమూర్తి శరత్ బాబు ఆ నకిలీ నిందితుడ్ని వెంటనే గుర్తించడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.