వాతావరణ మార్పులు అందరిపై ప్రభావం చూపుతున్నాయి: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
- ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీజేఐ
- పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వంతో ప్రజలు కలిసి పని చేయాలని వ్యాఖ్య
- ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమన్న సీజేఐ
మత్స్యకారులు, రైతులు, సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై రచించిన 'ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం అక్టోబర్, డిసెంబర్‌లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రంతో పాటు ప్రజలు కలిసి పని చేయాలన్నారు.
వాతావరణంలో మార్పులతో అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. వాతావరణ మార్పు సంపన్నులను మాత్రమే ప్రభావితం చేయడం లేదని, సమాజంలోని వారందరికీ నష్టమే అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తుందన్నారు. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని నిర్దేశిస్తుందన్నారు. ఆర్టికల్ 51ఏ(జీ) ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతోందన్నారు.
ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని, మన గతంలోని పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.