తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం... 3 గంటల్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు
- టోకెన్లు లేకుండా వచ్చిన వారికి 8 గంటల్లో సర్వదర్శనం
- నిన్న స్వామివారికి హుండీ రూపంలో రూ.3.54 కోట్ల ఆదాయం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం 8 కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. ఇక, రూ.300 టికెట్లు కలిగిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.54 కోట్ల ఆదాయం లభించింది.
శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను 61,576 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.54 కోట్ల ఆదాయం లభించింది.