తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా
- ఈ నెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- సమావేశం వాయిదా పడినట్లు వెల్లడించిన సీఎస్
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని వెల్లడించారు. కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతుభరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.