ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడి

  • అత్యాధునిక గగనతల రక్షణను దాటుకొని వచ్చిన డ్రోన్
  • దాడి సమయంలో ఇంట్లో లేని ప్రధాని నెతన్యాహు, ఆయన భార్య
  • నిర్ధారించిన ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు
హిజ్బుల్లా స్థావరాలను సమూలంగా ధ్వంసం చేయడం లక్ష్యంగా లెబనాన్‌లో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసం టార్గెట్‌గా డ్రోన్ దాడి జరిగింది. కీలకమైన ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించారు. సిజేరియాలో ఉన్న ప్రధాని నెతన్యాహు ఇల్లు లక్ష్యంగా డ్రోన్‌ను ప్రయోగించారని, అత్యాధునిక గగనతల రక్షణను దాటి మరీ ఈ డ్రోన్ వచ్చిందని అధికారులు తెలిపారు. లెబనాన్ నుంచి ఈ డ్రోన్‌ను ప్రయోగించారు.

కాగా దాడి ఘటన జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, అతడి భార్య ఇంట్లో లేరని ప్రధాని ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. కాగా లెబనాన్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


More Telugu News